Actress Jayaprada : సీనియర్ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్.! కారణమిదే.!
NQ Staff - December 22, 2022 / 12:11 PM IST

Actress Jayaprada : సీనియర్ నటి జయప్రద ఎన్నో తెలుగు, హిందీ సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం నటనకు కాస్త దూరంగా వున్నారామె. రాజకీయాల్లోనూ జయప్రద రాణించారు. ఎంపీగానూ పని చేశారు.
మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకురాలిగా తన సేవలు అందించాలనుకుంటున్నట్లు పలు సందర్భాల్లో జయప్రద చెప్పారుగానీ, అది సాధ్యపడటంలేదు.
నాన్ బెయిలబుల్ వారంట్.. ఎందుకట.?
సినీ నటి జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ప్రత్యేక కోర్టు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడానికి బలమైన కారణమే వుంది.
ఎన్నికల ప్రవర్తనా నియమాళిని ఉల్లంఘించారని జయప్రదపై గతంలో కేసులు నమోదయ్యాయి. వాటి విచారణకు ఆమె హాజరు కావాల్సి వుండగా, ప్రత్యక్షంగా హాజరు కాకపోవడంతోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.
గతంలో రాంపూర్ నుంచే ఎంపీగా జయప్రద ప్రాతినిథ్యం వహించారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారామె. 2019 నాటి కేసులో జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్, ఈ వారెంట్ విషయమై ఆమె స్పందించాల్సి వుంది.