Bigg Boss House : గౌతమ్, ప్రశాంత్ నడుమ పంచెకట్టు గొడవ.. నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..?
NQ Staff - November 21, 2023 / 09:56 AM IST

Bigg Boss House :
బిగ్ బాస్ లో పదకొండో వారం ఎలాంటి ఎలిమినేషన్స్ లేవు అని షాక్ ఇచ్చారు నాగార్జున. అయితే వచ్చే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ తప్పదని హెచ్చరించారు. ఇక 12వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం జరిగింది. అందరికంటే ముందుగా వచ్చిన అమర్ దీప్.. యావర్, రతికలను నామినేట్ చేశారు. మొదటి నుంచి అమర్ దీప్, రతికలకు అస్సలు పడట్లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఇద్దరూ ప్రతి విషయంలో ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటున్నారు. ఇక తర్వాత వచ్చిన గౌతమ్ ఆయన శత్రువులుగా భావిస్తున్న ప్రశాంత్, శివాజీలను నామినేట్ చేశాడు.
రతిక వచ్చి అమర్ దీప్, ప్రశాంత్ లను నామినేట్ చేసింది. అర్జున్ వంతు రాగానే ప్రిన్స్ యావర్ ను , శివాజీలను ఇద్దరినీ నామినేట్ చేశాడు. రతిక వంతు రాగానే ఆమె మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ లను నామినేట్ చేసింది. ప్రశాంత్ వచ్చి గౌతమ్, రతికలను నామినేట్ చేశాడు. ఇక అశ్విని మరో లెవల్. ఎందుకంటే ఆమె సిల్లీ రీజన్స్ తో ఎవరినీ నామినేట్ చేయనని చెప్పి తనను తానే సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. అయితే ఆమెను ఇంకెవరూ నామినేట్ చేయకపోవడం ఇక్కడ విశేషం. కాబట్టి ఆమె సేఫ్ జోన్ లోనే ఉందని చెప్పుకోవాలి.
ఇక గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్ ల నడుమ ఇంట్రెస్టింగ్ గొడవ జరగింది. అంతకు ముందు రతిక, పల్లవి ప్రశాంత్ లకు కూడా ఇలాగే ఇంట్రెస్టింగ్ గొడవ జరగింది. పల్లవి ప్రశాంత్ ఏకంగా సినిమా డైలాగులతో రెచ్చిపోయాడు. అమర్ దీప్, రతికల మధ్య కూడా ఇలాంటి కాంట్రవర్సీ గొడవనే జరిగింది. రతిక అడిగే ప్రశ్నలకు అమర్ దీప్ చెప్పిన సమాధానాలు బాగానే పేలాయి. నేను మారను.. ఇలాగే ఉంటాను అంటూ అమర్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా తాను మారనని స్పష్టం చేశారు. ఇక దాని తర్వాత పంచెకట్టు గొడవ జరిగింది పల్లవి ప్రశాంత్ – గౌతమ్ మధ్య.
గౌతమ్ వంతు వచ్చినప్పుడు ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. దాంతో మధ్యలో పంచె ప్రస్తావన తెచ్చాడు గౌతమ్. అయితే ప్రశాంత్ మాట్లాడుతూ… ఆ పంచె ఊడకుండా చూసుకో అంటూ రెచ్చిపోయాడు ప్రశాంత్. దాంతో గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. పంచె తెలుగువారి సంస్కృతి, అదే నాకు ఇష్టం అంటూ ఏదేదో మాట్లాడుతూ రెచ్చిపోయాడు.

Nominations For 12th Week In Bigg Boss House
దాంతో ఇద్దరి నడుమ గొడవ మరింత పెరిగిపోయింది. కాసేపు పీక్స్ కు వెళ్లాయి వారిద్దరి వాదనలు. గౌతమ్ బాగా ఆవేశంతో ఊగిపోవడంతో.. వెళ్లి ట్యాబ్లెట్లు వేసుకో అంటూ చెప్పాడు పల్లవి ప్రశాంత్. అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్, శివాజీ, రతిక, గౌతమ్, అమర్ దీప్, యావర్, అశ్విని నామినేట్ అయినట్టు తెలుస్తుంది. అర్జున్ కూడా నామినేషన్‌లో ఉన్నారని టాక్. ఇక ఎవిక్షన్ పాస్ కూడా ప్రశాంత్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దాంతో అతను ఈ సారి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.