MAHESH BABU: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈ సారి లేన‌ట్టేనంటూ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌తి ఏడాది త‌న తండ్రి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఏదో ఒక స‌ర్‌ప్రైజ్ ఇస్తూ వ‌స్తున్నారు. కాని ఈ సారి క‌రోనా వ‌ల‌న చాలా మంది ప‌రిస్థితి ధైన్యంగా మార‌డంతో నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. మే 31న ఎలాంటి ఫస్ట్ లుక్ లాంచ్ లేదని ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. అలాగే దీని పట్ల ఎవరూ కూడా ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చెయ్యవద్దని కూడా సూచించారు. ఇది అభిమానుల‌కు కాస్త విషాదాన్ని నింపిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో విడుద‌ల చేయ‌డం త‌గ‌ద‌ని మేక‌ర్స్ భావించారు.

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు .. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో సర్కారు వారి పాట చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఇంత వ‌ర‌కు విడుద‌ల కాలేదు. మే 31న మూవీ నుండి ఏదో ఒక స‌ర్‌ప్రైజ్ వ‌స్తుంద‌ని అంతా భావించారు. కాని ఇలా షాకింగ్ నిర్ణ‌యంతో అంద‌రిని నిరాశ‌ప‌రిచారు. మ‌రోవైపు మ‌హేష్‌బాబు- త్రివిక్ర‌మ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా వ‌స్తుంద‌ని అనుకున్నారు. కాని దానిపై కూడా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌బోర‌ని తెలుస్తుంది.కాగా, స‌ర్కారు వారి పాట ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.