ఈ ఏడాది పండగలకు ప్రయాణాల్లేవ్

Advertisement

దేశంలో కరోనా రోజు రోజుకు దారుణంగా విస్తరిస్తుంది. ఇక ఈ కరోనా దెబ్బకు పండగలు పబ్బాలు అన్ని కూడా నామమాత్రంగానే జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇలా ఉంటె దసరా, దీపావళి ఈ రెండు పండగలు అక్టోబరు-నవంబరు నెలల మధ్య వచ్చే అతిపెద్ద పండగలు అని అందరికి తెలిసిందే. అయితే మన దేశంలో ఈ పండగల సమయంలో ప్రయాణికులు అత్యధిక ప్రయాణాలు చేస్తుంటారు.

కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా విమానయానంతో పాటు అన్ని ప్రయాణ పరిశ్రమల్లో పెద్దగా జోరు కనిపించకపోవచ్చని ఓ సర్వే తెలుపుతుంది. ఇక భారత్ ‌లోని 239 జిల్లాల్లో 25,000 మంది పై ఈ సర్వే ను నిర్వహించారు. రాబోయే పండగల సీజన్‌ లో ప్రయాణాల విషయంలో ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని లోకల్‌ సర్కిల్స్‌ అనే ఆన్‌ లైన్‌ సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here