భారత్ లో.. ఒక్క కరోనా కేసు కూడా లేని ప్రాంతం ఇదే..!

Advertisement

భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికి దేశంలో పది లక్షలకు పై గా కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు కరోనా భారిన పడి చాలా వరకు మృతవాత పడ్డారు. ఒకవైపు అన్ని రాష్టాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటె దేశంలోని ఒక ప్రాంతంలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదు. ఇది వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం.

వివరాల్లోకి వెళితే భారత్ సరిహద్దు ప్రాంతం అయినా లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. భారత్ లో ఫిబ్రవరి నెలలో కేరళ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదు అవ్వడం జరిగింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు పది లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అయితే లక్షద్వీప్ ప్రాంతం లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ప్రాంత జనాభా అరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై మూడు మంది. అలాగే ఈ ప్రాంతంలో కేవలం మూడు హాస్పటల్లు మాత్రమే ఉన్నాయి.

అయితే ఈ ప్రాంతానికి వెళ్లాలంటే లక్షద్వీప్ రాజధాని కావరట్టి లో నిఘా ఉంచుతున్నారు.అలాగే కావరట్టి కి సమీపంలో ఉన్న కొచ్చి రేవు పట్టణంలో రెండు వారాలు క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ఎందుకంటె ఈ ప్రాంతానికి ప్రధాన మార్గం ఇక్కడ నుండే ఉంటుంది.

ఇక కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రాంత సరిహద్దుల్లో భారీగా కట్టడి చేసారు. అంతేకాకుండా మొదట్లో ఈ ప్రాంతానికి చెందిన అరవై ఒక్క మందికి కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానంతో ICMR మార్గదర్శాకాల ప్రకారం నడుచుకుంటే… ఆ తరువాత వాళ్లకు కూడా నెగిటివ్ వచ్చింది. అందుకే కరోనా కట్టడి విషయంలో ఆదర్శంగా నిలుస్తుంది ఈ లక్షద్వీప్ ప్రాంతం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here