కోవ్యాక్సిన్ రెడీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు

Advertisement

కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. ఇక ఒకవైపు ఈ వైరస్ ను నివారించేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఇక ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ను విడుడల చేసింది. అలాగే మన భారత్ లోను చాలా వరకు కంపెనీలు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. కానీ దాంట్లో మూడు కంపెనీలు మాత్రం ముందు ఉన్నాయి. అలాగే ఈ మూడు కంపెనీల నుండి వ్యాక్సిన్ కూడా రానుంది అని ప్రధాని మోడీ ఓ సమావేశంలో తెలిపాడు.

అయితే ఇదే తరుణంలో భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ పూర్తిగా సురక్షితమన్న ఓ శుభవార్త తెలిపింది. ఇక పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఈ వ్యాక్సిన్ ను రూపొందిస్తున్నారు. అలాగే ఈ వ్యాక్సిన్ తొలి దశ ట్రయల్స్ కూడా ముగిశాయని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లూ కనిపించలేదని అధికారులు తెలిపారు. ఒకవైపు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ డిసెంబర్ నెలలోగా వ్యాక్సిన్ వస్తుందని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here