కరోనా కారణంగా పండగలు అన్నింటికీ కూడా ఆటంకాలు వస్తున్నాయి. అయితే ప్రతిఒక్కరు ఎంతగానో ఎదురు చూసే గణపతి పండగకు కరోనా దృష్ట్యా ఆటంకం వాటిల్లింది. రాష్టంలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎనబై వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఇప్పటికే ఈ ఏడాది బోనాల పండగ నియమ నిబంధనల మధ్యన జరుపుకున్న విషయం తెలిసందే.
అయితే ఈ నెల 22 న జరగవలిసిన గణేష్ నవరాత్రులు మొదలుకానున్నాయి. కానీ ఈ ఏడాది గణేష్ పండగను ఇండ్లలోనే జరుపుకోవాలని, అలాగే గణేష్ ఉత్సవ కమిటీ లు మండపాలు వేసి ఎటువంటి ఏర్పాట్లు చేయవద్దని పోలీస్ శాఖ అధికారులు వెల్లడించాడు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే ప్రత్రిఒక్కరు కూడా తమకు సహకరించాలని అన్నారు. అలాగే విగ్రహాలు తయారు చేసే వారు అనవసరంగా విగ్రహాలు తయారు చేసి నష్టపోవద్దని అధికారులు సూచించారు.