మాస్క్ పెట్టుకోకపోతే అక్కడ వెరైటీ శిక్ష

Advertisement

కరోనా దెబ్బకు ప్రతిఒక్కరికి మాస్క్, శానిటైజర్ తప్పనిసరి అయింది. ఇక కొన్ని చోట్ల మాస్కులు ధరించకపోతే జరిమానాలు కూడా విధిస్తున్నారు. మరి కొన్ని చోట్ల శిక్షలు విధిస్తున్నారు. అయిన కూడా చాలా మందిలో మార్పులు రావడం లేదు. ఇదే తరుణంలో ఇండోనేషియా సర్కార్ వెరైటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ దేశంలో బయట తిరిగే వారు మాస్క్ ధరించకపోతే వారితో స్మశానంలా గోతులు తవ్విస్తున్నారు.

అయితే కరోనాతో మరణించిన రోగులను ఖననం చేసేందుకు ఇలా గోతులు తవ్విపిస్తున్నారు. కరోనాతో మరణించిన వారిని దగ్గరి నుంచి చూసిన తరువాత నైనా వారిలో మార్పు వస్తుందని, అందుకే ఇలాంటి శిక్షలు విధిస్తున్నట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here