శ్మశానవాటిక లో ఐసొలేషన్. సంగారెడ్డిలో దారుణం..!

Advertisement

కరోనా సోకినా రోగుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. అయితే కొంతమంది మానవత్వాన్ని మరిచి కరోనా సోకిన వ్యక్తులను శ్మశానవాటిక లో ఐసొలేషన్ గా ఏర్పాటు చేసారు. ఈ విషాదమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా ఖానాపూర్ తండాలో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. దీనితో హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు.

కానీ కరోనా సోకిన బాధితులు గ్రామంలో ఉండడానికి నిరాకరించారు ఆ గ్రామ పెద్దలు. దీనితో దిక్కులేని స్థితిలో స్మశాన వాటికలో ఒక ఓపెన్ షెడ్డులో వారికీ ఐసొలేషన్ గా ఏర్పాటు చేశారు. ఒకవైపు ప్రభుత్వాలు మనం పోరాడాల్సింది వ్యాధితో.. రోగితో కాదు” అని చెప్తున్నా కూడా కొంతమంది మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here