అడ్వాణీ, జోషీలకు అందని ఆహ్వానం

Advertisement

యూపీ: ఈనెల 5వ తేదీన జరగనున్న అయోధ్యరామ మందిర భూమి పూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శేరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి ఎవరెవరు రానున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి చాలా తక్కువ మంది అతిథులను ఆహ్వానించనున్నారు. అయితే రామ మందిర నిర్మాణంలో ఎంతో కృషి చేసిన అడ్వాణీ, జోషీలకు ఇంకా ఆహ్వానం అందలేదు. వారి వయసు రీత్యా కరోనా కారణంగా ఆహ్వానించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే ఇదే నేపథ్యంలో ఉమా భారతి, కళ్యాణ్ సింగ్ లకు మాత్రం ఆహ్వానాలు అందాయి. ఆహ్వానాలు అందని వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అడ్వాణీ, జోషీలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here