Pawan Kalyan : నిన్నెందుకు సీఎం చేయాలి పవన్‌…?

NQ Staff - June 17, 2023 / 06:30 PM IST

Pawan Kalyan : నిన్నెందుకు సీఎం చేయాలి పవన్‌…?

Pawan Kalyan : వారాహి యాత్రలో పవన్‌ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు అర్థ రహితంగా ఉన్నాయంటూ వైకాపా నాయకులు విమర్శించడంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా పెదవి విరుస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ యాత్రలో భాగంగా మాట్లాడుతూ జనాలను కేరింతలు పెట్టించేందుకు పంచ్ డైలాగ్స్ తో స్పీచ్ లు ఇస్తున్నాడు.. వైకాపా పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు.

తనను రెండు సార్లు సీఎం చేసి చూడండి అంటూ పవన్ కళ్యాణ్‌ జనాలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. తన పరిపాలన నచ్చకుంటే రెండు సంవత్సరాల ముందే దిగి పోతాను అంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ అపరిపక్వతకు ఇదే నిదర్శనం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పరిపాలన బాగాలేదు అంటూ పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు చేయడం బాగానే ఉంది కానీ ఆయన్ను ఎందుకు సీఎం చేయాలి అనే విషయం లో మాత్రం స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం లేదు.

నన్ను సీఎం చేయండి… నన్ను సీఎం చేయండి అంటూ పవన్ పదే పదే మాట్లాడుతున్నాడు.. ఇంతకు ఆయన్ను ఎందుకు సీఎం చేయాలి అనేది మాత్రం ప్రజలకు కానీ మీడియాకు కాని స్పష్టంగా చెప్పడం లేదు అంటూ ఈ సందర్భంగా కొందరు రాజకీయ విశ్లేషకులు మరియు వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us