Bigg Boss 7 : ఇంతకి తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్ ఉందా? లేదా?
NQ Staff - June 22, 2023 / 08:05 PM IST
Bigg Boss 7 : తెలుగు బిగ్ బాస్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. భారీ ఎత్తున రేటింగ్ కూడా దక్కింది. ఈ ఏడాది కొత్త సీజన్ బిగ్ బాస్ ఇప్పటి వరకు హడావుడి మొదలు అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా కంటెస్టెంట్స్ విషయంలో కానీ… కనీసం హోస్ట్ విషయంలో కానీ క్లారిటీ లేదు.
బిగ్ బాస్ సీజన్ 7 విషయంలో అభిమానులు మరియు బుల్లి తెర వర్గాల వారు అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. అసలు ఈ ఏడాది కొత్త సీజన్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇలాంటి సమయంలో స్టార్ మా వారు షో యొక్క కొత్త సీజన్ గురించి ఎలాంటి లీక్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు కంటెస్టెంట్స్ ఎంపిక మొదలుకుని ప్రతి విషయంలో కూడా లీక్ ఇచ్చే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. బిగ్ బాస్ కొత్త సీజన్ హోస్ట్ ఎవరు అంటూ చాలా రోజులుగా చర్చ జరుగుతోంది.
హోస్ట్ కన్ఫర్మ్ అవ్వక పోవడం వల్లే ఈ సీజన్ ను హోల్డ్ లో పెట్టారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ ఓటీటీ విషయంలో అసలు ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. ఒకే ఒక్క సీజన్ తో బిగ్ బాస్ ఓటీటీ అటకెక్కింది. ముందు ముందు కూడా ఉండక పోవచ్చు అని తెలుస్తోంది.