బాలాపూర్ లడ్డు వేలం రద్దు

Advertisement

హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలకు మంచి గుర్తింపు ఉంటుంది. ఇక ఈ ఏడాది కరోనా దృష్ట్యా గణేష్ ఉత్సవాలకు ఆటంకం కలిగింది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మహా నగరంలో ఖైరతాబాద్, బాలాపూర్ ఈ రెండు గణనాథులకు గొప్ప పేరు ఉంది. ఖైరతాబాద్ గణపతి ఎత్తులో పేరుంటే, బాలాపూర్ గణపతి లడ్డుకు మంచి విలువ ఉంటుంది. ఇక కరోనా దెబ్బకు ఖైరతాబాద్ గణపతి తొమ్మిది అడుగులకు మాత్రమే పరిమితం అయ్యాడు. అలాగే బాలాపూర్ లడ్డు వేలం ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ వెల్లడించింది.

అయితే చరిత్రలో మొట్ట మొదటి సారిగా లడ్డు కు వేలం వెయ్యనిది ఈ ఏడాదే అనే చెప్పాలి. ఇక ప్రతి ఏడాది లక్షలు పెట్టి ఈ లడ్డును కొనడానికి ముందుకు వచ్చేది. అయితే 1994 సంవత్సరంలో బాలాపూర్ గణేష్ వేలంపాట ప్రారంభించారు. ఇక ఆ సంవత్సరం 450 రూపాయలకు కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నాడు. ఇక గత సంవత్సరం 17.60 లక్షల రూపాయలకు రికార్డు స్థాయిలో కొలను రాంరెడ్డి సొంతం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here