షాకింగ్ లుక్‌లో నంద‌మూరి హీరో.. పోస్ట‌ర్ వైలెంట్‌గా ఉందంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

నంద‌మూరి ఫ్యామిలీ హీరో క‌ళ్యాణ్ రామ్ త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 17 సినిమాలు చేశాడు. ఇందులో ప‌టాస్ త‌ప్ప మ‌రే సినిమా పెద్ద విజ‌యం సాధించ‌లేదు. ఇక ఇప్పుడు త‌న 18వ సినిమాగా సోష‌ల్ ఫాంట‌సీ చిత్రాన్ని ఎంపిక చేసుకున్నాడు. త‌న తాత ఎన్టీఆర్ 98వ జ‌యంతి సంద‌ర్భంగా మూవీ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ రివీల్ చేశారు. నందమూరి హీరో కొత్త సినిమాకు ”బింబిసార” అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేసినట్లు వెల్లడించారు.

కళ్యాణ్ రామ్ బార్బేరియన్ కింగ్ గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. యుద్ధంలో తన చేతిలో చనిపోయినవారి శవాల గుట్టపై కూర్చొని వైలెంటుగా చూస్తున్నాడు. పోస్ట‌ర్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక మోష‌న్ పోస్ట‌ర్ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.  సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ ”బింబిసార” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో క్యాథరిన్ ట్రెసా – సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపొందుతుంది.