ప్రభాస్ చెల్లెలుగా నివేదా థామస్

Admin - August 21, 2020 / 10:44 AM IST

ప్రభాస్ చెల్లెలుగా నివేదా థామస్

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ‘మహానటి’ సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రభాస్ కెరీర్ లో 21వ చిత్రంగా రానున్న ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించనున్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనెని హీరోయిన్ గా ఎంచుకున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని సమాచారం వస్తుంది. అదే ప్రభాస్ చెల్లలు పాత్ర. అయితే ఆ పాత్ర కోసం తాజాగా నాగ్ అశ్విన్ నివేద థామస్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు నివేద కూడా ఒక్క హీరోయిన్ పాత్రలే కాకుండా ఇతర పాత్రల్లో కూడా నటిస్తుంది. అందుకే నాగ్ అశ్విన్ నివేదను సంప్రదించినట్లు సమాచారం. ఇక ప్రభాస్ చెల్లెలు పాత్రకు నివేద గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us