బిగ్ బాస్ : సుజాత పై నెటిజన్లు ఆగ్రహం.

బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరు కూడా హోస్ట్ నాగార్జునను సర్ అని పిలుస్తున్నారు. కానీ సుజాత మాత్రం బిట్టు అని పిలుస్తుంది. ఇక సుజాత నాగ్ ను బిట్టు అని పిలుస్తుండడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో ప్రారంభం అయినా మొదట్లో సుజాతను నాగ్ నీ న‌వ్వు భ‌లే ఉంటుంది అన్న పాపానికి ప్రతిదానికి న‌వ్వుతూ ఉంది.ఇక కొన్ని సందర్భాల్లో సుజాతకు నవ్వు రాకపోయినప్పటికీ నవ్వుతూ అభిమానులకు కోపం తెప్పిస్తుంది. ప్రస్తుతం ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు ఆమెను ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే సుజాత‌ది అంత కూడా ఫేక్ న‌వ్వులని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు ఆమె న‌వ్వు చూడ‌లేక‌ పోతున్నామ‌ని బిగ్ బాస్ వీక్షకులు బోలుమంటున్నారు. ఒకవైపు ఆమెకంటే పెద్దవారు, సినీ కెరీర్ లో పెద్ద వారు కూడా నాగ్ ను సార్ అని పిలుస్తున్నారు. కానీ సుజాత మాత్రం పెద్దంతరం లేకుండా ఒక స్టార్ హీరో నాగార్జునను అలా పిలవడంతో బిగ్ బాస్ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.