అలీ ని ఘోరంగా తిడుతున్న నెటిజెన్స్ కారణం పవన్ కళ్యాణ్

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ఉన్న రికార్డ్ మరియు స్టామినా ఏంటో మరో సారి ప్రూవ్ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ బర్త్డే సెప్టెంబర్ 2 న ఉండగా ఇప్పటి నుండే అడ్వాన్స్ హ్యాపీ బిర్ట్గ్డే ని ఆయనకు తెలుపుతున్నారు అభిమానులు మరియు కొంతమంది స్టార్ లు. అలా తెలుగులో ఏ స్టార్ పొందనటువంటి హైయెస్ట్ రికార్డ్ ని ఒక దానిని పవర్ స్టార్ తన కాతాలో వేసుకున్నాడు. దాదాపుగా 20 లక్షల కు పైగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ లు చేయడం జరిగింది.

అయితే అలానే పవన్ కళ్యాణ్ పాత మిత్రుడు అయినటువంటి అలీ కూడా పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్తూనే వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు…ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించిన చెదరని నీ నవ్వు కి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు అంటూ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ని టాగ్ చేసి విషెస్ ని తెలియ చేయడం జరిగింది. ఇలా అలీ చేసిన ఈ పోస్ట్ కి కొంత మంది నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ రీట్వీట్ లు చేయసాగారు.

అలీ ఒక వేళా ఇదే ట్వీట్ ని ఎన్నికల ముందు చేసినట్లయితే వచ్చే అటువంటి రెస్పాన్స్ వేరే విధంగా ఉండేది కానీ ఎన్నికల సమయం లో ఈ స్నేహితుల ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. కొన్ని చోట్ల అలీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు ఎన్నికల సమయం లో అలీ ప్రవర్తించిన తీరు పైన పవన్ కళ్యాణ్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అవి మాత్రమే కాకుండా ప్రస్తుతం అలీ వైస్సార్సీపీ పార్టీ లో చేరడం కూడా మరొక కారణం అన్నట్లు తెలుస్తుంది. అయితే ఇలా ఆ పార్టీ లో చేరినప్పటికీ ఆక్టివ్ గా ఉండకపోయినా పవన్ కళ్యాణ్ నిరంతరం విముఖత చూపే వైస్సార్సీపీ పార్టీ లోనే ఇంకా కొనసాగుతున్నాడు దానితో అలీ పవర్ స్టార్ ని రాజకీయ పరంగా ఎప్పుడైనా దెబ్బ కొట్టొచ్చు అన్న అభిప్రాయం పవన్ అభిమానుల్లో బలంగా ఏర్పడినట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here