Nithya Shetty Photo Of Taking Drink Has Viral : మందు తాగుతూ అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..!

NQ Staff - July 27, 2023 / 10:11 AM IST

Nithya Shetty Photo Of Taking Drink Has Viral : మందు తాగుతూ అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..!

Nithya Shetty Photo Of Taking Drink Has Viral :

సినిమా తారలపై మొదటి నుంచి అనేక రూమర్లు ఉన్నాయి. వారు మందు తాగుతారని.. సిగరెట్లు కాలుస్తారని.. పార్టలు, పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తారని.. అబ్బో ఇలా ఒక్కటేమిటి వారికి ఉన్న చెడు అలవాట్లు ఇంకెవరికీ లేవన్నంతగా చెడ్డ పేర్లు ఉన్నాయి. కానీ హీరోయిన్లు కూడా అందుకు తగ్గట్టే ప్రవర్తిస్తున్నారు.

ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇలాగే మందు తాగుతూ అడ్డంగా దొరికిపోయింది. ఆమె ఎవరో కాదు నిత్యాశెట్టి. ఆమె గతంలో హిందీ సినిమాల్లో బాగా పేమస్. కన్నడలో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో ‘నువ్వు తోపురా’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ బ్యూటీ.

ఆ సినిమాల్లో నటించి..

దాని తర్వాత ‘ఓ పిట్ట కథ’, ‘తలైవి’, ‘వాంటెడ్ పండు గాడ్’, హలో వరల్డ్’ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది ఈ హాట్ బ్యూటీ. అయితే రీసెంట్ గా ఆమె తన ఫ్రెండ్ బర్త్ డే వేడుకలో పాల్గొంది. ఇందులో ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగుతున్న ఫొటోలను ఆమె స్వయంగా ఇన్ స్టాలో పోస్టు చేసింది.

Nithya Shetty Photo Of Taking Drink Has Viral

Nithya Shetty Photo Of Taking Drink Has Viral

ఇంకేముంది ఇవి చూసిన నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. ఈ పాప అప్పుడే మొదలెట్టేసిందా.. అస్సలు ఆగలేకపోతున్నారా. మందు తాగుతూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ గడ్డి పెడుతున్నారు నెటిజన్లు. సినిమాల్లో నీతులు చెప్పడం కాదు.. రియల్ లైఫ్ లో నీతిగా బతకండం నేర్చుకోండి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us