Nithya Menon : ఆ హీరో అసభ్యకరంగా టచ్ చేశాడు.. నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు..!
NQ Staff - June 11, 2023 / 01:15 PM IST

Nithya Menon : నిత్యా మీనన్ ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లతో చాలా బిజీగా ఉంది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ట్యాలెంట్ లో ఆమె ఎవరికీ తీసిపోదు. అప్పట్లో హీరోయిన్లలాగా ఆమె కాస్త బొద్దుగా ఉన్నా సరే చాలానే అవకాశాలు వచ్చాయి.
కానీ ఎందుకో స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె హీరోల సినిమాల్లో వచ్చిన ఛాన్సులు చేసుకుంటూ వస్తోంది. రీసెంట్ గానే లెస్బియన్ పాత్రలో వెబ్ సిరీస్ కూడా చేసింది. అయితే ఆమె అప్పుడప్పుడు చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో నిత్యా మీనన్ తమిళ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు నాకు తెలుగులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. కానీ తమిళంలో మాత్రం ఓ సినిమా సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాను. ఓ హీరో నన్ను చాలా వేధించాడు.
అతను ఓ సారి సీన్ సమయంలో నన్ను అసభ్యకరంగా టచ్ చేశాడు. దాంతో నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అతను సీన్ పేరుతో నన్ను ఇబ్బందిగా తాకడం స్టార్ట్ చేశాడు. అతనితో నాకు గొడవ ఎందుకు అని వదిలేశాను. కానీ ఆ తర్వాత ఆ హీరోతో మరోసారి నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అంటూ తెలిపింది నిత్యా మీనన్.