‘A’ Trailer: ప్యారసెట్మాల్ కోసం ఎంత మంది చనిపోయారో తెలుసా?.. ‘A’ ట్రైలర్ వైరల్

Nithin Prasanna Preethi Asrani Movie A Trailer
Nithin Prasanna Preethi Asrani Movie A Trailer

‘A’ Trailer కొన్ని సినిమాల్లో ఆసక్తిని రేకెత్తించే అంశాలుంటాయి. వాటిని టీజర్, ట్రైలర్‌లో అలా అలా శాంపిల్‌గా చూపిస్తుంటారు. వాటిని చూసిన జనాలకు సినిమాల మీద ఆసక్తి ఏర్పడుతుంది. ఇది సినిమా ప్రమోషన్స్‌లో ఓ ఎత్తుగడ. పోస్టర్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతీ ఒక్క అంశంలోనూ ఎంతో జాగ్రత్త వహిస్తుంటారు. అయితే ఓ చిన్న సినిమాను జనాల మెదళ్లోకి ఎక్కించడం అంటే మామూలు విషయం కాదు.

అలా చిన్న సినిమాలు ప్రేక్షకులకు ఆలస్యంగా చేరుతుంటాయి. తాజాగా ఓ మూవీ కూడా అంతే. చిన్నగా మొదలై ఇప్పుడు అందరినీ నోళ్లలోనూ నానుతోంది. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన థ్రిల్లర్ చిత్రం “A”. ఇప్పటికే వదిలిన పోస్టర్స్, పాటలు నెటిజన్లను బాగానే ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. చిన్న సినిమా ట్రైలర్‌ను పెద్ద హీరో విడుదల చేస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు. అయితే ట్రైలర్‌లో ఆసక్తిని కలిగించే అంశాలెన్నో ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు ట్రైలర్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. పలు రకాల జానర్లను కలిపి ఈ మూవీని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.

‘A’ ట్రైలర్ వైరల్ : ‘A’ Trailer
నీకొక విషయం తెలుసు.. నీకు ఇప్పుడు జ్వరం వస్తే వేసుకోవాడానికి ప్యారసెట్మాల్ ట్యాబ్లెట్ ఉంది.. కానీ దాన్ని కనిపెట్టడానికి ఎంత మంది చనిపోయారో నీకు తెలుసా? అంటూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇదొక సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. మార్చి 5న A మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement