నిశ్శబ్దంగా నిద్రపుచ్చుతున్న “నిశ్శబ్దం” మూవీ

Admin - October 2, 2020 / 04:50 AM IST

నిశ్శబ్దంగా నిద్రపుచ్చుతున్న “నిశ్శబ్దం” మూవీ

నటీనటులు : అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే
దర్శకుడు: హేమంత్ మధుకర్
డైలాగ్స్ & స్క్రీన్ ప్లే: కొనా వెంకట్
సంగీత దర్శకుడు: గోపి సుందర్
నిర్మాత: కోన వెంకట్, విశ్వ ప్రసాద్

కథాంశం:

1972లో అమెరికాలోని ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఒక ఇంట్లో హత్యకు గురి అవుతారు. అయితే వారు ఎలా చనిపోయారో, ఎవరి చంపారో అనే విషయం తెలియకపోవడం వల్ల అది ఒక మిస్టరీగా మిగులుతుంది. ఆ హాంటెడ్ హౌస్ లోకి 42 సంవత్సరాల తరువాత సాక్షి(అనుష్క), ఆమెకు కాబోయే భర్త ఆంటోనీ ఆ ఇంటిలోకి వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్లిన తరువాత ఒక అనూహ్యమైన సంఘటన జరుతుంది. దానికి గల కారణాలు తెలియవు. అయితే ఆ ఘటనకు సాక్షినే సాక్ష్యం. అయితే సాక్షి మాటలు రావు, చెవులు వినిపించవు. అలాగే అదే ప్రాంతంలో కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఈరెండు సంఘటనల వెనక ఉన్నది ఎవరన్న విషయం తెలుసుకోవడమే మిగిలిన కథ.

విశ్లేషణ:

ఇది ఒక థ్రిల్లర్ మూవీ కాబట్టి చాలా మూవీస్ యొక్క రిఫరెన్స్ లు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కథ మాత్రం అస్సలు ఆకట్టుకోదు. థ్రిల్లర్ కాబట్టి మొదటి నిమిషం నుండి ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతూ ఉండాలి కానీ ఈ మూవీ స్టార్ట్ అయిన 20నిమిషాలకే చూస్తున్న ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ పోతుంది. అక్కడ ఏమి జరిగినా మనం పెద్దగా పట్టించుకోము. ఓటీటీల వాడకం పెరగడం వల్ల ప్రేక్షకులు థ్రిల్లర్స్ చూసే విధానం మారిపోయింది. థ్రిల్లర్ లో ఇంటెలిజెన్స్ తో లాజిక్స్ ను చెప్పకపోతే ప్రేక్షకులు మూవీలను ఇష్టపడటం లేదు. ఈ మూవీ యూనిట్ మాత్రం ప్రేక్షకులను తక్కువ అంచనా వేసి కథను సిద్ధం చేసుకున్నారు. మూవీలో సాక్షికి ఉన్న లోపాలతో సినిమాలో ఎదో పెద్ద అద్భుతం జరుగుతుందని ఎక్సపెక్ట్ చేస్తాం కానీ అలాంటివేవి జరగవు. జస్ట్ ఎదో కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని అనుష్కకు ఆ లోపాలను పెట్టారు. అనుష్క, మాధవన్ లాంటి నటులు ఇలాంటి చెత్త సబ్జెక్ట్ ను ఎలా ఒప్పుకున్నారో అర్ధం కావడం లేదు. ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ అయ్యింది కాబట్టి కొన్ని డబ్బులైనా వచ్చాయి అదే థియేటర్ లో విడుదల అయ్యి ఉంటే పెద్ద హీరోలా మూవీస్ కు వచ్చే పార్కింగ్ పైసల్ కూడా వచ్చేవి కావు.

రివ్యూ ఇన్ సింగిల్ వర్డ్:

మూవీ చూడకుండా నిశ్శబ్దంగా పడుకోండి.ఎందుకంటే మూవీ చూస్తూ కూడా మనం చేసేది అదే కాబట్టి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us