Nirmala Sitharaman : బడ్జెట్ ప్రసంగంలో నోరు జారిన నిర్మల సీతారామన్.. గొల్లుమన్న సభ్యులు
NQ Staff - February 1, 2023 / 06:51 PM IST

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో 2023-24 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఆ సమయంలోనే నిర్మల సీతారామన్ కొన్ని చలోక్తులను విసరడంతో పాటు కొన్ని సార్లు నోరు జారారు. ముఖ్యంగా ఓల్డ్ పొల్యూటెడ్ వెహికల్స్ అనడానికి బదులు ఓల్డ్ పొలిటిషన్ అంటూ మాట్లాడడంతో సభ్యులంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు.
కాలుష్యాన్ని పెంచే పాత వాహనాలను బ్యాన్ చేయాలని మాట్లాడుతున్న సందర్భంలో ఓల్డ్ పొల్యూటెడ్ వెహికల్స్ కి బదులు ఓల్డ్ పొలిటిషియన్స్ ని బ్యాన్ చేయాలి అన్నట్లుగా నిర్మల సీతారామన్ మాట్లాడి అందరిలో నవ్వులు పూయించారు.
ఆమె నోరు జారిన వెంటనే అంతా కూడా అవును నిజమే అంటూ గట్టిగా బల్లాలు చరుస్తూ నవ్వేశారు. నేను కూడా దాన్ని సమర్థిస్తున్నాను అన్నట్లుగా నిర్మల సీతారామన్ కామెంట్ చేశారు.