nimmagadda ramesh : ఏపీలో అసలు సిసలైన రాజకీయాలు ఇప్పుడు మొదలవుతాయి. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నామినేషన్ల కోసం.. క్యాస్ట్ సర్టిఫికెట్ ను జత చేయాల్సి ఉంటుంది. అయితే.. క్యాస్ట్ సర్టిఫికెట్ విషయంలో ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కుల దృవీకరణ పత్రాల మీద, ఎన్ఓసీల మీద.. ఏపీ సీఎం జగన్ ఫోటో ఉందని.. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం అని.. వాటిని వెంటనే కుల, ఎనఓసీ పత్రాల మీద తీసేయాలంటూ.. ఏపీ చీఫ్ సెక్రటరీకి నిమ్మగడ్డ లేఖ రాశారు.
కుల దృవీకరణ పత్రాలు జారీ చేసే తహశీల్దార్లకు వెంటనే దీనికి సంబంధించిన సవరణలు తెలియజేయాంటూ.. నిమ్మగడ్డ ఆదేశించారు. పత్రాల జారీ విషయంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని.. అలాగే ఎలాంటి వివక్ష చూపించకూడదంటూ ఆయన స్పష్టం చేశారు. అయితే.. కుల దృవీకరణ పత్రాలపై సీఎం జగన్ ఫోటో ఉండటంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ.. ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. వెంటనే ప్రవీణ్ ప్రకాశ్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ ఆదేశించారు. ఎన్నికల విధుల నుంచి తప్పించడమే కాకుండా… ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు నిమ్మగడ్డ.
ఈనెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉండగా.. ఆ సమావేశం జరగకుండా… ప్రవీణ్ ప్రకాశ్ చేశారని ఎన్నికల సంఘం ఆరోపిస్తోంది. అలాగే… పంచాయతీ ఎన్నికలకు అధికారులను సన్నద్ధం చేయడంలోనూ ప్రవీణ్ ప్రకాశ్ విఫలమయ్యారని.. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి లేట్ అయిందంటూ ఎన్నికల కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. అయితే.. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.