Nimmagadda :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీవ్రమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ మరియు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికార పార్టీకి కౌంటర్ ఇవ్వడానికి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పలు పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని నిమ్మగడ్డ ఒక నిర్ణయం తీసుకున్నారు.

ఎలక్షన్లు పూర్తయ్యే వరకు గ్రామాల్లోకి ప్రభుత్వ వాహనాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో నాయకుల ఎన్నికల ప్రచారానికి తెర పడినట్లయింది. ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కి రాసిన లేఖలో నిమ్మగడ్డ పలు అంశాలను పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కేవలం గ్రామాల్లో మాత్రమే వర్తిస్తుందని.. మంత్రులు గ్రామాల్లో కి వెళ్ళినప్పుడు ప్రభుత్వ అధికారులను వెంటపెట్టుకుని వెళ్ళకూడదని లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు అని ఆయన ఆదేశించారు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయితే ఇక ఏ రాజకీయ నేత కూడా ప్రచారం చేయకూడదని ఆయన విస్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం కార్యాలయాల్లో కూడా ప్రెస్ మీట్ లు పెట్టకూడదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
అయితే నామినేషన్లు వేసే అభ్యర్థులకు కుల ధ్రువ పత్రాలను ఇవ్వడం లేదన్న సమస్యకు కూడా ఆయన ఒక పరిష్కారం చెప్పారు. కొత్త కుల ధృవీకరణ పత్రాలు లేకపోతే పాత కుల ధృవీకరణ పత్రాలతో నామినేషన్ వెయ్యడానికి అనుమతి ఇవ్వాలని ఆయన ఎన్నికల అధికారులను ఆదేశించారు. కొత్త సర్టిఫికెట్ల సమర్పణకు నిర్ణీత సమయం ఇవ్వాలని ఆయన చెప్పారు. పోటీ చేసే వారికి ఫాస్ట్ ట్రాక్ విధానం లో కొత్త కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.