Nikhil Siddhartha : రామ్ చరణ్ వల్ల చిక్కుల్లో పడ్డ నిఖిల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..!

NQ Staff - June 19, 2023 / 11:59 AM IST

Nikhil Siddhartha : రామ్ చరణ్ వల్ల చిక్కుల్లో పడ్డ నిఖిల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..!

Nikhil Siddhartha : నిఖిల్ ఈ నడుమ వెరైటీ కథలను ఎంచుకుంటున్నాడు. డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. ఇక తాజాగా ఆయన నటిస్తున్న మూవీ స్పై. ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి రీసెర్చ్ చేసే స్పై పాత్రలో నటిస్తున్నాడు నిఖిల్. చనిపోయిన తర్వాత నేతాజీ అస్తికలు ఏమయ్యాయి అనే కోణంలో సినిమాను తీస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీని ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్టు నిఖిల్ తాజాగా తన ట్వీట్ లో వెల్లడించారు. ఇది చూసిన ఓ నెటిజన్ ప్రాపగాండ స్టార్ అంటూ నెగెటివ్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ఇండియా విలన్ సావర్కర్ అంటూ కామెంట్ చేశాడు. ఇలా రకరకాలుగా ఆయన్ను నెగెటివ్ కామెంట్లతో తిట్టిపోస్తున్నారు.

Nikhil Siddhartha Acting In Movie The Indian House

Nikhil Siddhartha Acting In Movie The Indian House

ఇందుకు కారణం కూడా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి నిర్మాణంలో వస్తున్నది ఇండియా హౌజ్ః సావర్కర్ అనే సినిమాలో నిఖిల్ నటిస్తున్నాడు. ఈ సినిమాను సావర్కర్ జీవిత కథ ఆధారంగా తీస్తున్నారు. సావర్కర్ ను మన దేశంలో కొందరు స్వాతంత్య్ర పోరాట యోధుడిగా చూస్తే.. మరికొందరు మాత్రం ఇండియా వ్యతిరేకిగా చూస్తారు.

ఆయన్ను అభిమానించే వారికంటే ధ్వేషించే వారే ఎక్కువగా ఉంటారు. అందుకే నిఖిల్ పై ఇప్పుడు నెగెటివిటీ బాగా పెరిగిపోతోంది. ఈ సినిమా ఎఫెక్ట్ స్పై సినిమాపై కూడా పడుతోంది. ఒక రకంగా ఇది ఆయన్ను చిక్కుల్లో పడేస్తోంది. మొహమాటానికి ఒప్పుకుని నిఖిల్ తప్పు చేశాడా అని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us