NIHARIKA: కేక పెట్టిస్తున్న నిహారిక న్యూ లుక్.. ఫ్యాన్స్ ఫిదా
Priyanka - March 10, 2021 / 03:28 PM IST

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఎల్లప్పుడు అభిమానులకు కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. గత ఏడాది డిసెంబర్‌లో పెళ్లి పీటలెక్కిన నిహారిక ప్రస్తుతం వైవాహిక జీవాతన్ని చక్కగా ఎంజాయ్ చేస్తుంది. వీలున్నప్పుడల్లా తన భర్తతో కలసి షికార్లు కొడుతుంది. అంతటితో ఆగుతుందా వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తూ ఉంది. అయితే పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ మొదలు పెట్టిన నిహారిక ప్రస్తుతం ఆ షూటింగ్ బిజీలో ఉంది.
అయితే వెబ్ సిరీస్ షూటింగ్‌లో నిహారిక కాలు అదుపు తప్పడంతో ఆమె కాలుకి చిన్నపాటి ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా తన ఇన్‌స్టా స్టోరీలో కాలుకి కట్టు ఉన్న ఫొటోని షేర్ చేస్తూ తన భర్త సేవలందిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఫొటోకు నెటిజన్స్ పలు రకాలుగా స్పందించారు. ఇక తాజాగా నిహారిక డిఫరెంట్ లుక్‌కి సంబంధించిన ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన అభిమానులు మంత్రముగ్దులవుతున్నారు. నిహారిక అంటే నిహారికనే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిహారికని త్వరలో వెండితెరపై చూడాలని వారు ఆశిస్తున్నారు.