Niharika: ఆ ఫీలింగ్ ఎంతో గొప్పది.. గాల్లో తేలిపోతోన్న నిహారిక

NQ Staff - February 17, 2021 / 11:12 AM IST

Niharika: ఆ ఫీలింగ్ ఎంతో గొప్పది.. గాల్లో తేలిపోతోన్న నిహారిక

Niharika మెగా డాటర్ నిహారిక పెళ్లి తరువాత ఫుల్ చిల్ అవుతోంది. అయితే చైతన్యతో పెళ్లి తరువాత నిహారిక నటనకు దూరమవుతుందనే టాక్ వచ్చింది. అలా పెళ్లి ఫిక్స్ అయిన కారణంగానే ఓ సినిమాను నుంచి తప్పుకుంది. తమిళ ప్రాజెక్ట్‌లో నిహారిక ఓకే అయింది.. అంతా రెడీ అనుకున్న సమయంలోనూ ఇలా పెళ్లి ఫిక్స్ అయింది. దీంతో నిహారిక ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే పెళ్లి తరువాత నిహారిక పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటుందనే టాక్ బయటకు వచ్చింది.

అయితే నిహారిక మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నా.. నటనకు మాత్రం దూరం కాదని తాజాగా తెలిసి వచ్చింది. నిహారికకు గుర్తింపు తెచ్చిన వెబ్ సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్‌లను వదలుకోలేకపోతోంది. అందుకే ఆ మధ్య మళ్లీ ఓ వెబ్ సిరీస్‌ను ఓకే చేసింది. భర్త చేతుల మీదుగా ఆ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయించింది. అలా పెళ్లి తరువాత మళ్లీ నటనను ప్రారంభించింది.

Niharika Konidela Starts Web series shoot

Niharika Konidela Starts Web series shoot

గత నెలలో జరిగిన పూజా కార్యక్రమాల్లో అనసూయ పాల్గొంది. ఆ వెబ్ సిరీస్‌లో అనసూయ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించబోతోంది. అయితే దాదాపు నటనకు, కెమెరాకు దూరమైన ఏడాదికి పైగా అవుతోంది. ఎప్పుడూ కూడా స్టార్ట్ కెమెరా యాక్షన్ అనే సౌండ్స్ మధ్య ఉండే నిహారికకు ఈ గ్యాప్ చాలా కొత్తగా అనిపించవచ్చు.

గాల్లో తేలిపోతోన్న నిహారిక: Niharika

అందుకే ఇన్ని రోజుల తరువాత మళ్లీ సెట్స్ మీదకు రావడం, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుండటంతో నిహారిక ఆనందానికి అవుధుల్లేకుండా పోయాయ్. తాజాగా నిహారిక వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు సెట్‌లోని వాతావరణాన్ని చూపిస్తూ నిహారిక తన ఫీలింగ్‌ను బయటపెట్టేసింది. మళ్లీ ఇలా రావడం చెప్పలేని ఫీలింగ్‌ను ఇస్తోందంటూ తెగ సంబరపడిపోయింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us