Niharika Konidela : అప్పుడు సమంత చేసిన పనే చేస్తున్న నిహారిక.. అంటే అది కన్ఫర్మ్..?
NQ Staff - June 1, 2023 / 10:21 AM IST

Niharika Konidela : గత కొన్ని రోజులుగా మెగా డాటర్ నిహారిక వార్తల్లో తరచూ నిలుస్తోంది. పెండ్లి అయిన తర్వాత నిత్యం కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుచున్న భామ.. రీసెంట్ గా విడాకుల కారణంతో వార్తల్లో నిలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య తన ఇన్ స్టా గ్రామ్ నుంచి నిహారికతో జరిగిన పెండ్లి ఫొటోలు డిలీట్ చేశాడు.

Niharika Konidela Latest Cute Video
దాంతో అప్పటి నుంచి నిహారిక కూడా ఒంటురిగానే తిరుగతోంది. అంతకు ముందు భర్తతో కలిసి దిగిన ఫొటోలను పోస్టు చేసేది. కానీ చైతన్య ఫొటోలు డిలీట్ చేసిన తర్వాత సింగిల్ గానే ఫొటోలు పోస్టు చేస్తోంది. అంతే కాకుండా ఇప్పుడు వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె విదేశాలకు టూర్స్ కు వెళ్తోంది.

Niharika Konidela Latest Cute Video
రీసెంట్ గా ఆమె బాలి దేశానికి వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేస్తోంది. ఇవి చూసిన నెటిజన్లు ఆమె గతంలో సమంత చేసిన విధంగానే చేస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంత కూడా చైతూతో విడాకుల ప్రకటనకు ముందు ఇలాగే ఫ్రెండ్స్ తో వెకేషన్లకు, టూర్లకు వెళ్లి డిప్రెషన్ నుంచి బయట పడింది.

Niharika Konidela Latest Cute Video
ఇప్పుడు నిహారిక కూడా ఇదే పని చేస్తోంది. అంటే సమంత లాగే నిహారిక కూడా త్వరలోనే విడాకుల ప్రకటన చేయబోతుందా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిహారిక ఇంట్లో వారు ఇప్పటికే రాజీ కుదిర్చే చర్చలు జరిపినా కుదరలేదని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.