Niharika : నా భ‌ర్త‌కు సినిమాల్లో చేయడం ఇష్టం లేదు, అందుకే మానేశా..నిహారిక కామెంట్స్

Niharika : నాగబాబు కూతురిగా, మెగా ప్రిన్స్ గా నిహారిక అంద‌రికి సుప‌రిచితం. వెబ్ సిరీస్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ ముద్దుగుమ్మ ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర‌పై మెరిసింది. ప్రొడ్యూసర్ గా, టీవీ షోస్ లో గెస్ట్ గా వస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ‘ఆలీతో సరదాగా’ షోలో నిహారిక ఇంటర్వ్యూ ఇచ్చింది.

niharika about her movies
niharika about her movies

ఈ ఇంటర్వ్యూలో ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తన పెళ్లి, సినిమాల గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. తనది పెద్దలు కుదిర్చిన వివాహం అని, అన్న వరుణ్ తేజ్, తన హస్బెండ్ చైతన్య చిన్నప్పుడు స్కూల్ లో క్లాస్ మేట్స్ అని తెలిపింది. పెళ్ళికి ముందు హీరోయిన్ గా కూడా నటించారు. మరి పెళ్లి అయ్యాక సినిమాలకి దూరంగా ఉన్నారు ఎందుకు అని ఆలీ అడుగగా ఆశ్చ‌ర్య‌పోయే విష‌యాలు చెప్పింది.

మా ఆయనకు నేను సినిమాలు చేయడం ఇష్టం లేదు. అందుకే మానేశాను. అయినా ఈ కాలంలో హీరోయిన్‌లకు పెళ్లి అయినా కెరీర్‌ ఏం మారలేదు. సమంతకు పెళ్లికి ముందు ఎంత క్రేజ్‌ ఉండేదో, పెళ్లి అయిన తర్వాత కూడా అంతే ఉంది. మా అయన జస్ట్ సినిమాల్లో హీరోయిన్ గా వద్దన్నారు. కానీ టీవీ, వెబ్ సిరీస్, యూట్యూబ్ వాటికి అడ్డు చెప్పలేదు. అందుకే వాటిల్లో చేస్తున్నాను.

బాగా మంచి పాత్ర వస్తే సినిమాల్లో మా ఆయన్ని అడిగి చేస్తాను అని తెలిపింది ఈ కొణిదెల వారమ్మాయి.సినిమాలు కాకుండా ఏదైనా చేద్దామని టీచ్‌ ఫర్‌ ఇండియా అనే కార్యక్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పానంది. అయినా మూవీస్‌పై ఇష్టంతో ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశానని చెప్పుకొచ్చింది.

ముద్దపప్పు ఆవకాయ్‌, నాన్నకూచీలతో పాటు యంగ్‌స్టర్స్‌తో కలిసి స్నేహంపై ఓ వెబ్‌సిరీస్‌ తీశానన్న నిహారిక ఇటీవలే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ప్రొడక్షనే కాకుండా యూట్యూబర్‌ నిఖిల్‌తో కలిసి ఓ సూపర్‌ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నానన్న ఆమె దానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.