బిగ్ బ్రేకింగ్ : ఏపీలో నైట్ కర్ఫ్యూ… ఎప్పటి నుంచి అంటే? రూల్స్ ఇవే?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం పాక్షికంగా కర్ఫ్యూలను విధిస్తున్నాయి. తెలంగాణలో ఇటీవలే నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం విధించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.

night curfews imposed in andhra pradesh
night curfews imposed in andhra pradesh

శనివారం నుంచి అంటే రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలు అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఈ సమయంలో అత్యవసర సేవలు మినహా… మిగితా ఏ సేవలూ పని చేయవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

హాస్పిటళ్లు, మెడికల్ షాపులు, ఇతరత్రా ఎమర్జెన్సీ సేవలు మినహా… దుకాణాలు, ప్రజా రవాణా, మాల్స్, సినిమా థియేటర్లు, ఇతరత్రా షాపులు అన్నీ మూసి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. నైట్ కర్ఫ్యూపై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆళ్లనాని మీడియాకు వెల్లడించారు.

ఏప్రిల్ 22న ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం… ఏపీలో 24 గంటల్లో సుమారు 11 వేల కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఏపీలో సుమారు 67 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే… మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement