Nidhi Agarwal Reacts On Casting Couch : ఆడిషన్స్ కు పిలిచి లో దుస్తులు చూపించమన్నాడు.. నిధి అగర్వాల్ సెన్సేషన్..!
NQ Staff - July 31, 2023 / 02:10 PM IST

Nidhi Agarwal Reacts On Casting Couch :
నిధి అగర్వాల్ నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అవుతోంది. ఆమెకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరో పక్కన ఛాన్స్ వచ్చిందని సంతోషపడింది. పైగా క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. కాబట్టి దీని తర్వాత తనకు పెద్ద ఛాన్సులు వస్తాయనే ఆశలు పెట్టుకుంది ఈ భామ.
కానీ నిధి అగర్వాల్ ఆశలు మొత్తం అడియాశలు అయిపోతున్నాయి. ఎందుకంటే బ్రో సినిమా షూటింగ్ రెండేళ్లుగా చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆమె ఈ రెండేళ్లు వేరే సినిమాలకు కూడా కమిట్ అవ్వకుండా వెయిట్ చేస్తోంది. ఇక తెలుగులో ప్రభాస్ పక్కన ఛాన్స్ వచ్చిందనే న్యూస్ కూడా వినిపిస్తోంది.
ఇక కెరీర్ పరంగా బిజీగా ఉండే ఈ భామ.. అప్పుడప్పుడు చేసే కామెంట్లు పెద్ద దుమారమే రేపుతుంటాయి. ఇక తాజాగా ఆమె మరోసారి ఇలాంటి బోల్డ్ కామెంట్లతో రెచ్చిపోయింది. ఆమె మాట్లాడుతూ తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి క్లారిటీ ఇచ్చింది. నేను ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పను.
టాలీవుడ్ లో చాలా తక్కువ..
కానీ బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో చాలా తక్కువ. నేను గతంలో బాలీవుడ్ లో ఛాన్సుల కోసం ప్రయత్నించినప్పుడు ఓ డైరెక్టర్ నన్ను ఆడిషన్స్ కు రమ్మన్నాడు. సరే అని వెళ్లాను. సినిమాలో ఓ బోల్డ్ సీన్ ఉంటుంది. బికినీ వేసుకుని కనిపించాలన్నాడు. సరే అన్నాను. నువ్వు ఒకసారి నీ లో దుస్తులు చూపించు.. ఆ సీన్ కు నువ్వు సెట్ అవుతావో లేదో చూడాలన్నాడు.
నాకు అసహ్యంగా అనిపించింది. నేను ఇప్పుడు చూపించలేను. కానీ సీన్ లో చేస్తాను అని చెప్పాను. కానీ అతను వినిపించుకోలేదు. పదే పదే అదే అడిగాడు. ఇక చేసేది లేక అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత కూడా చాలామంది ఇలాంటివే అడిగారు. కానీ నేను వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు అంటూ తెలిపింది ఈ భామ.