Nidhhi Agerwal: ఎన్న‌డు ప‌డ‌నంత బాధ ప‌డ్డానంటున్న నిధి అగ‌ర్వాల్‌

Nidhhi Agerwal: గ్లామ‌ర్ డాల్ నిధి అగ‌ర్వాల్‌కి షార్ట్ టైంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఈ అమ్మ‌డి కోసం త‌మిళ నాట గుళ్లు కూడా క‌డుతున్నారంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న హరిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమాలో న‌టిస్తుంది. 17వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఓ వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతోందనీ సమాచారం.

Nidhhi Agerwal

ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను నిధి అగర్వాల్ తాజాగా పంచుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో అది చిన్న విషయమని అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నేను పంచమి అనే యువరాణిగా నటిస్తున్నాననీ చెప్పుకొచ్చిందట. ఈ పాత్ర నా కెరీర్ లోనే ఎంతో వైవిధ్యభరితమైనదని పేర్కొంది.

శారీరకంగా నాకు ఈ పాత్ర నాకెంతో సవాల్గా నిలిచిందనీ చెప్పిందట నిధి .ఈ సినిమా కోసం నేను చాలా ఆభరణాలు కూడా ధరించాననీ అలాగే ఒంటిపైన ధరించిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా చాలా బరువైనదనీ చెప్పిందట . ప్రతిదీ కూడా చెందినదో కుట్టినదే అంటూ ఆమె చెప్పుకొచ్చిందనీ సమాచారం. ఇక ఇలాంటివి బరువైన ఆభరణాలను మోస్తూ షూటింగ్లో పాల్గొనడం ఎంతో కష్టంగా అనిపించేదనీ తెలిపింది.

ఒక షాట్ అయిపోతే జాగ్రత్తగా ఒక దగ్గర కూర్చోవడమే తప్ప విశ్రాంతి తీసుకోవడం అనేది వీలుండేది కాదనీ చెప్పుకొచ్చిందట. అయితే నేను పడుతున్న ఈ కష్టం అంతా కూడా నాకు విలువైనదిగా అనిపించేది అని ఆమె తెలిపినట్లు సమాచారం.. నటిగా ఇంత అద్భుతమైన సినిమాలో భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చిందట.నిధి అగర్వాల్ ఈ సినిమా తో పాటుగా తెలుగులో మరొక ‘హీరో’అనే సినిమాలో న‌టిస్తుంది.