Nidhhi Agerwal: అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నిధి అగ‌ర్వాల్.. ఫొటోలు వైర‌ల్

స‌వ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగ‌ర్వాల్ ఆ త‌ర్వాత మిస్టర్ మ‌జ్ను చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న న‌టించింది. ఈ రెండు చిత్రాలు నిధి అగ‌ర్వాల్ కెరియ‌ర్‌కు పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చిన నిధి అగ‌ర్వాల్ ఇప్పుడు తెలుగు, తమిళంలో అద‌ర‌గొడుతుంది. సినిమాల‌తోనే కాదు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తోను రెచ్చ‌గొడుతుంది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిధి త‌ర‌చుగా వెరైటీగా ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తుంది. సోష‌ల్ మీడియాలో నిధి షేర్ చేసే ఫోటోలు అభిమానుల‌కు మంచి ఉత్సాహాన్ని అందిస్తుంటాయి. తాజాగా బార్బీ డాల్ స్టైల్‌లో నిధి అగ‌ర్వాల్ చేసిన ఫొటో షూట్ అదిరిపోయింది. ఈ ఫొటోల‌లో నిధి అగ‌ర్వాల్ మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తుంది. ఈమె అంద‌చందాల‌తో పాటు న‌ట‌న‌కు కూడా మెచ్చిన త‌మిళ తంబీలు గుడి కూడా క‌ట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం యువ హీరో సినిమాతో పాటు పవ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమాలో న‌టిస్తుంది. ప‌వ‌న్ సినిమాపై బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకుంది నిధి.

Advertisement