Pavitra Lokesh : పవిత్ర లోకేష్ ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
NQ Staff - May 27, 2023 / 01:58 PM IST

Pavitra Lokesh : ఈ నడుమ పవిత్ర లోకేష్ పేరు ఎంతగా ఫేమస్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. సీనియర్ నరేశ్ తో ఆమె సహజీవనం చేస్తున్న కారణంగా చాలా పాపులర్ అయిపోయింది. ఆమెకు 40 ఏండ్ల వయసు ఉంది. అలాంటి ఆమె 60 ఏండ్ల నరేశ్ తో ఈ వయసులో సహజీవనం చేయడం చాలా నెగెటివిటీని క్రియేట్ చేస్తోంది.
అయితే నరేశ్ ను మాత్రం ఆమె అస్సలు వీడట్లేదు. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. త్వరలోనే పెండ్లి కూడా చేసుకుంటామని చెప్పేశారు నరేశ్. అయితే రీసెంట్ గా వీరిద్దరూ కలిసి నటించిన మూవీ మళ్లీపెళ్లి రిలీజ్ అయింది. డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఇద్దరి బయోపిక్ ఆధారంగా సినిమా వచ్చిందని చెబుతున్నారు.
అయితే ఈ సందర్భంగా పవిత్ర రెమ్యునరేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఒక్క రోజుకు గతంలో రూ.50వేలు తీసుకునేది. కానీ ఇప్పుడు నరేశ్ కారణంగా ఆమె చాలా ఫేమస్ అయింది. దాంతో ఇప్పుడు ఆమె ఒక్క రోజుకు రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తోందంట. ఇదే విషయం హాట్ టాపిక్ అవుతోంది.