Covid Virus : ముక్కులో చుక్కలు.! కోవిడ్ కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి.!
NQ Staff - December 23, 2022 / 01:05 PM IST

Covid Virus : మన దేశంలో కోవిడ్ వైరస్ని ఎదుర్కొనేందుకు కొత్త టీకా అందుబాటులోకి వచ్చింది. ఇది శరీరంలోకి గుచ్చేది కాదు.. ముక్కులో వేసేది. అదేనండీ, నాసల్ డ్రాప్స్.!
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్న దరిమిలా, కొత్త వేవ్ భయాలు పెరిగిపోతున్నాయి. మన దేశంలోనూ బహిరంగ ప్రదేశాల్లో మళ్ళీ మాస్కుల వినియోగం తప్పనిసరి అవుతోంది. చైనాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్, ఇప్పటికే ప్రపంచ దేశాలకు పాకేసినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు.
బూస్టర్ డోసుగా అందుబాటులోకి..
ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్ వంటి టీకాలకు సంబంధించి రెండు డోసులు పూర్తి చేసుకున్నవారు, బూస్టర్ డోసుగా ముక్కులో వేసుకునే చుక్కల టీకాని వేసుకోవచ్చు.
హెటిరోలాగరస్ బూస్టర్గా దీన్ని పిలుస్తున్నారు. వ్యాక్సినేషన్లో భాగంగా ముక్కులో రెండు చుక్కల మందుని వేయడం జరుగుతుంది. శరీరంలో గుచ్చితే వచ్చే ఇమ్యూనిటీ తరహాలోనే, ఈ చుక్కల మందుతో కూడా కోవిడ్ వ్యాక్సిన్ నుంచి రక్షణ లభించనుంది.
కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ అందుబాటులో వుంటుంది. ముందు ముందు ప్రభుత్వాలు సైతం ఉచితంగా ఈ వ్యాక్సిన్ని అందించే అవకాశాలు లేకపోలేదు.