Posani Krishna Murali: పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. కొత్త ట్విస్ట్ ఏంటంటే..!

Posani Krishna Murali: గ‌త మూడు నాలుగు రోజులుగా పోసాని కృష్ణ ముర‌ళి వార్త‌ల‌లో తెగ నానుతున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు ఆయ‌న‌పై దాడికి ప్ర‌య‌త్నించారు. ప్రెస్ క్ల‌బ్ ద‌గ్గ‌రే పోసానిపై దాడి చేసే ప్ర‌య‌త్నం చేసిన కుద‌ర‌లేదు. ఇటీవల తన ఇంటిపై కొందరు రాళ్లతో దాడి చేశారని పోసాని ఆరోపించారు.

New Twist in Attack on Posani Krishna Murali Case
New Twist in Attack on Posani Krishna Murali Case

తన ఇంటిపై ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి పరుష పదజాలంతో ధూషిస్తూ రాళ్లు రువ్వారని పోసాని ఇంటి వాచ్ మన్ పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. దీంతో వారికి కొత్త ట్వస్ట్ ఏర్పడింది. పోసాని ఇంటి పరిసరాల్లో ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగింది. సీసీ కెమెరాలతో దాడి చేసినవారెవరో గుర్తించవచ్చని పోలీసులు అనుకున్నారు.

హైదరాబాద్లోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న ఇంటిపై అర్ధరాత్రి కొందరు యువకులు బండిపై వచ్చారని ఆ తరువాత ఇంటిపై దాడి చేశారని ఇంటి వాచ్ మన్ పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి జరిగిన సమయంలో పోసాని ఇంట్లో లేడు . పోలీసులు ఎల్లారెడ్డిగూడలోని పోలీసులు ఇంటిని పరిశీలించారు. అక్కడ జరిగిన దాడిలో పోసాని ఇంటికి సంబంధించిన గ్లాసెస్ పగిలినట్లు కనిపించాయి. అలాగే అక్కడ కొన్ని రాళ్లను కూడా గుర్తించారు.

ఎనిమిది నెలలుగా పోసాని ఆ ఇంట్లో ఉండడం లేదు. కేవలం వాచ్ మెన్ కుటుంబం మాత్రమే ఉంటోంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. ఎక్కువగా గచ్చిబౌలిలోని అపార్టమెంట్లోనే ఉంటాడని వాళ్లు తెలిపారు. పోసాని ఇంటి వాచ్ మన్ పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాలు ఇదివరకే ఏర్పాటు చేసుకోలేదా..? లేక దాడి చేయడానికి వచ్చిన వారే తీసేసారా..? అన్న కోణంలో విచారిస్తున్నారు.

దాడి జరిగిన తరువాత పోసాని మరోసారి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తన ఇంటిపై దాడి చేయించారని అంటున్నారు. పోసాని వెనుక ఏపీ ప్రభుత్వం ఉందని ఆయనతో పవన్ పై ఏపీ అక్కడి ప్రభుత్వం విమర్శలు చేయిస్తోందని తెలంగాణ జనసేన ఇన్ చార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆరోపించారు. మరోవైపు తాము పోసానిపై చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంపై అనుమానాలున్నాయని అంటున్నారు. తెలంగాణ నుంచి పోసాని కృష్ణ మురళిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.