బయటకొస్తున్న డాలర్ బాయ్ అక్రమాలు

Advertisement

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదయ్యిన 139 మంది కేసుల వ్యవహారంలో కీలకంగా ఉన్న డాలర్ బాయ్ అక్రమాలు, ఒకదాని వెనుక ఒకటి బయటకు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డాలర్‌ భాయ్‌ పై మూడు కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. ఇక పది సంవత్సరాల క్రితమే డాలర్ ‌భాయ్‌ పై భద్రాద్రి జిల్లాలోని రామావరం ప్రాంతంలో పలు కేసులు నమోదయ్యాయి. అలాగే చీటీల పేరుతో ఏకంగా 10 లక్షల రూపాయలు వసూలు చేసి ఎంతో మందిని మోసం చేసి డాలర్‌భాయ్ పరారయ్యాడు.

అలాగే బ్యాంక్ దగ్గర ఓ వ్యక్తి నుండి 7 లక్షల రూపాయలు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఇక దీనితో గత కొన్ని రోజులుగా ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలోకి డాలర్ బాయ్ వెళ్లాడు. ఇక ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిలను మోసం చేశాడు. అయితే డాలర్ బాయ్ అసలు పేరు రాజశ్రీకర్. ఇక ఇతగాడి గురించి పోలిసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here