Telangana : తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.!
NQ Staff - November 28, 2022 / 03:06 PM IST

Telangana : ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అప్పటి సచివాలయం విశేష సేవలందించింది. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు సైతం ఆ సచివాలయమే సేవలందించింది. అయితే, సచివాలయం వాస్తు సరిగ్గా లేదంటూ, ఆ సచివాలయాన్ని కూల్చివేసింది తెలంగాణ ప్రభుత్వం.
కూల్చివేసిన చోటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, సంప్రదాయ డిజైన్లు, అత్యాధునిక డిజైన్ల కలబోతగా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ముహూర్తం ఖరారు.. సంక్రాంతి తర్వాతే.!
కొత్త సచివాలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. 2023 జనవరి 18న తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఐదో అంతస్తులో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి అయ్యాక, తెలంగాణ సచివాలయంలో కేసీయార్ అడుగు పెట్టింది లేదు.. ఈ విషయమై చాలా విమర్శలు వచ్చాయి. వాస్తు భయాల నేపథ్యంలోనే కేసీయార్, సచివాలయానికి వెళ్ళలేదనేది నిర్వివాదాంశం.
మరి కొత్త సచివాలయాన్ని తన ఆలోచనలకు తగ్గట్టుగా నిర్మించుకున్న కేసీయార్, ఆ సచివాలయంలోకి అడుగు పెడితే.. ఆ హంగామా ఎలా వుంటుంది.? వేచి చూడాల్సిందే.