Cage For Drunkards: తాగి దొరికితే ఊరంతా మ‌టన్ పార్టీ ఇవ్వాలి.. టేస్ట్ కూడా అదిరిపోవాలంట‌..!

Cage For Drunkards: మ‌ద్యం ప్రాణానికి హానిక‌రం అని చెబుతున్నా కూడా కొంద‌రు మందు బాబులు మ‌ద్యంలో మునిగి తేలుతున్నారు. ఇంటి ప‌ట్టున ఉండి తాగ‌కుండా డ్రైవింగ్‌లు చేస్తూ వేరే వారిని ఇబ్బందుల‌కి గురి చేస్తున్నారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే మద్యపాన నిషేదం అమల్లో ఉంది…మద్యం నిషేదం అమలులో ఉన్న ముఖ్య రాష్ట్రం గుజరాత్‌ అనే చెప్పాలి.

TheNewsQube-

ఇక్క‌డ వింతైన నిబంధ‌న‌లు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి. ప్ర‌స్తుతం అహ్మదాబాద్, సురేంద్రనగర్‌, అమ్రేలీ, కచ్‌, మోతిపుర జిల్లాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం కొనసాగుతోంది. గ్రామాల్లో ఊరి మధ్య బోను వంటిది ఏర్పాటు చేశారు. ఎవరైనా మద్యం తాగి వచ్చినట్లయితే రాత్రి అంతా అందులో ఉంచుతారు.

బోనులో ఉన్న వారు 1200 రూపాయ‌లు క‌ట్టి బ‌య‌ట‌కు వ‌స్తారు. బోనులో ఉన్న‌వారు వారంలోపు గ్రామంలోని వారందరికీ కూడా 25వేల రూపాయల ఖర్చుతో మటన్‌ దావత్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా ఆ గ్రామం మొత్తం ఆ రోజు వింధులో పాల్గొంటుంది. ఈ శిక్షను కాదనే వారు, పాటించని వారికి గ్రామ బహిష్కరణ ఉంటుంది.

గ్రామంలో వారికి ఎవరు కూడా సాయం చేయక పోవడంతో పాటు, వారిని ఎవరు కూడా పట్టించుకోకూడదు. అలా కాకుండా ఉండాలి అంటే 25 వేలు ఖర్చు చేసి గ్రామస్తులందరికి కూడా వింధు ఇవ్వాల్సిందే. వినడానికి వింతగా అనిపించినా గ్రామస్తులంతా ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటున్నారు. పొరపాటున ఎవరైనా తాగితే పొరుగు ఊరిలోనో, లేదంటే గ్రామ శివారులో, పొలాల్లోనే గడపాల్సి ఉంటుంది.

అవి లెక్క చేయ‌కుండా ఊర్లోకి వ‌స్తే 12వందల రూపాయలు గ్రామ పంచాయితికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పైగా, ఊళ్లోకి ఎవరైనా తాగుబోతులు వచ్చారని గుర్తించి సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకించి కొందరు మహిళలను ఇన్‌ఫార్మర్లుగా నియమించారు. వారికి 501 రూపాయల నుంచి 11వందల రూపాయల వరకు నజరానాగా చెల్లిస్తున్నారు. అలా చెప్పిన వారిని పేర్లను గోప్యంగా ఉంచుతారు. ఈ నిబంధనలతో తమ గ్రామాలు ప్రశాంతంగా ఉంటున్నాయని చెబుతున్నారు గ్రామ పెద్దలు. ఇంట్లో భార్య భర్తల గొడవలు, తాగి చనిపోయిన వారి భార్యల కష్టాలు కనిపించకుండా పోయాయంటున్నారు