మహిళల్లో కంటే పురుషుల్లోనే కరోనా వ్యాప్తి ఎక్కువ. ఎందుకో తెలుసా..!

Advertisement

కరోనా ప్రతిఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె అమెరికాలోని యేల్ న్యూ హెవెన్ ఆసుపత్రిలో 18 ఏళ్ళ వయస్సు పైబడిన 86 మంది కరోనా బాధితుల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో అనేక విషయాలు బయట పెట్టారు.

అయితే కరోనాని ఎదుర్కొనే శక్తి పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఉండే ‘టి’ కణాలు బలంగా ఉంటాయి. దీనివల్ల పురుషులకంటే మహిళలే సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయనంలో బయట పడింది. అయితే ఈ ‘టి’ కణాలను ‘టి లింఫోసైట్’ అని కూడా అంటారు. అలాగే ఇవి ఒక రకానికి చెందిన తెల్లరక్తకణాలు. ఇక ఈ టి కణాలు మనుషులలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here