ఇదో విచిత్రం.. పెళ్లి కుమారుడు, కుమార్తె జంప్

సాధార‌ణంగా పెళ్లికి ముందు అమ్మాయి వేరే వాడితో వెళ్లి పోయిందని, పెళ్లి పీట‌ల మీద నుండి వ‌రుడు వెళ్లిపోయాడ‌ని లేదంటే ప్రేమికులుగా ఉన్న వారు జంప్ అయ్యార‌ని ఇప్ప‌టివ‌ర‌కు విన్నాం. కాని పెళ్లి పీట‌ల మీద ఉన్న వ‌ధువు వ‌రుడు మ‌రి కొద్ది క్ష‌ణాల‌ల‌లో ఒక్క‌ట‌వుతారనుకుంటున్న స‌మ‌యంలో జంప్ అయ్యారు.విన‌డానికి ఇది కాస్త ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ ఒడిశాలో ఈ సంఘ‌న‌ట నిజంగా జ‌రిగింది.

మ‌రి కొద్ది క్ష‌ణాల‌లో పెళ్లి చేసుకొని ఒకే ఇంటికి వెళ్ల‌బోయే వారు ఎందుకు జంప్ అయ్యారంటే కోవిడ్ ఎఫెక్ట్‌. ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకోవాలంటే క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. కొంత మంది అతిథుల‌ని మాత్ర‌మే పెళ్లిళ్ల‌కు ఆహ్వానించాల‌ని చెబుతున్నారు. కాని ఈ పెళ్లికి ఎక్కువ మంది అతిథులు రావ‌డంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

త‌మ‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో, ప్ర‌శ్న‌ల‌తో హింసిస్తారేమో , కేసులు పెడ‌తారేమో అని భావించిన పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె జంప్ అయ్యార‌ని బంధువులు చెబుతున్నారు. ఈ సంఘ‌ట‌న బాలాసోర్ జిల్లాలోని చాపులియా చౌక్ లో చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న విని ప్ర‌తి ఒక్క‌రు న‌వ్వుకుంటున్నారు. ముహుర్తానికి ముందే క‌నిపించ‌కుండా పోయిన ఆ జంట ఇప్ప‌టికీ ఎక్క‌డికి పోయారో కూడా తెలియ‌రావ‌డం లేదు.

ఒడిశాలో పెళ్లికి యాబై మందికి మంచి హాజ‌రు కాకూడ‌ద‌నే నిబంధ‌నలు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. ఈ పెళ్లికి 200కి పైగా అతిథ‌లుఉ రావ‌డంతో పోలీసులు వ‌చ్చి హ‌డావిడి చేసిన‌ట్టు తెలుస్తుంది.