చిత్తూర్ జిల్లాలో కరోనా కలకలం, కరోనా భారిన పడ్డ కాబోయే పోలీసులు

Advertisement

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న కాబోయే పోలీసులు కరోనా భారిన పడ్డారు. 380 మంది విద్యార్థులు అక్కడ శిక్షణ పొందుతున్నారు. వీరిలో దాదాపు 100 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సెప్టెంబర్ 5న శిక్షణ ముగియనున్న తరుణంలో ఇలా అభ్యర్థులు కరోనా భారిన పడటం బాధాకరం.

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువ లక్షణాలు ఉన్నవారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. తక్కువ తీవ్రత ఉన్నవారిని హౌస్ క్వారంటైన్ లో ఉంచారు. ఇరుకు గదుల్లో ఉండటమే సెంటర్ లో కరోనా వ్యాప్తికి కారణమని అభ్యర్థులు వెల్లడించారు. ఈ విషయంపై ఇంకా ట్రైనింగ్ సెంటర్ అధికారులు వివరణ ఇవ్వలేదు. అధికారుల నిర్లక్షమే కారణమని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ లో కరోనా వ్యాప్తికి అధికారులు బాధ్యత వహించి, వారికి నాణ్యమైన చికిత్స అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here