Rohit Sharma : పోలార్డ్‌పై రోహిత్ శర్మ ట్వీట్: దారుణంగా తిడుతున్న నెటిజనం.!
NQ Staff - November 16, 2022 / 07:38 PM IST

Rohit Sharma : టీమిండియా వరల్డ్ కప్ టీ20 పోటీల నుంచి సెమీస్ దశలోనే ఔట్ అయ్యింది. ఈ మంట ఇంకా అభిమానుల్ని వెంటాడుతూనే వుంది. ఇంగ్లాండ్ జట్టుపై గట్టి పోటీ ఇవ్వకుండా టీమిండియా చేతులెత్తేయడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఇప్పటిదాకా టీమిండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించకుండా, ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాడు కెవిన్ పోలార్డ్ ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పడంపై స్పందించడంతో అభిమానుల ఆగ్రహం రెట్టింపయ్యింది.
హిట్ మ్యాన్ రోహిత్.. ఇలా చేశావెందుకు.?
‘బిగ్ మ్యాన్.. బిగ్ ఇంపాక్ట్.. ఎప్పుడూ హృదయంతో ఆడావ్.. ట్రూ ముంబై ఇండియన్స్ లెజెండ్’ అంటూ పేర్కొన్నాడు రోహిత్ శర్మ, పోలార్డ్ రిటైర్మెంట్ విషయమై. పోలార్డ్ ముంబై జట్టుకి ఇకపై బ్యాటింగ్ కోచ్‌గా అందుబాటులో వుండనున్న సంగతి తెలిసిందే.
‘రోహిత్.. నీ నుంచి ఇలాంటి స్పందన ఆశించలేదు. 130 కోట్ల మంది భారతీయుల ఆశల్ని టీమిండియా కెప్టెన్‌గా నువ్వు మోయాల్సి వుంది. ఆ భారతీయులకు నువ్వు సమాధానం చెప్పలేదు..’ అంటూ భారత క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మని తిట్టిపోస్తున్నారు.
‘నువ్వు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించెయ్.. నీలాంటి ద్రోహిని మేం ఎక్కడా చూడలేదు..’ అంటూ సోషల్ మీడియాలో రోహిత్‌ని ఏకి పారేస్తున్నారు నెటిజన్లు.