Kalpika Ganesh : నటి కల్పిక గణేష్‌ని ఏకిపారేస్తున్న నెటిజన్లు.!
NQ Staff - November 22, 2022 / 09:43 PM IST

Kalpika Ganesh : ఎవరీ కల్పిక గణేష్.? అని నెటిజనం తెగ వెతికేస్తున్నారు. తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్‌లో కనిపించింది కల్పిక. చక్కగా తెలుగు మాట్లాడుతుంది. మంచి నటి కూడా.!
ఇప్పటిదాకా ఎప్పుడూ వివాదాల్లోకెక్కలేదుగానీ, ‘యశోద’ సినిమా వచ్చాక మాత్రం, ఈ భామకి వివాదాల మీద మోజు పెరిగినట్లుంది.
తననెవరో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ మొదలెట్టి, యాగీ ఓ రేంజ్‌కి తీసుకెళ్ళిపోయింది. పోలీసుల్ని సైతం విమర్శించే స్థాయికి వెళ్ళిందిప్పుడు కల్పిక.
సైబర్ క్రైమ్ పోలీసులు అంటే ఏంటి.?
సైబర్ క్రైమ్ పోలీసుల పనే అది.. ఫిర్యాదు చేశాక, పట్టుకోవాలి కదా.? కానీ, ‘మీరు చేసే అసభ్యకర ప్రదర్శనే ఇలాంటివాటికి కారణం.. అని పోలీసులు చెప్పారు..’ అంటూ వాపోతోంది కల్పిక గణేష్. సైబర్ క్రైమ్ పోలీసులు అసలు అలా అనే అవకాశముందా.?
అసలు కల్పిక ఎవరికి ఫిర్యాదు చేసిందో ఏమోనంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. నిజమే, సోషల్ అబ్యూజ్ అనేది ఛండాలంగా తయారైంది.
అనసూయ లాంటోళ్ళు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కానీ, చర్యలు వుండట్లేదు. ఎందుకిలా.? ఏమోగానీ, ఈ ఎపిసోడ్‌తో కల్పిక పాపులారిటీ పెరగకపోగా, ఆమెపై ట్రోలింగ్ ఇంకాస్త పెరిగి పోయింది.