Trolls On Actress Priyamani : అక్కడ కూడా నల్లగా ఉంటుందా అంటూ ఏడిపించారు.. ప్రియమణి ఆవేదన..!
NQ Staff - June 27, 2023 / 12:50 PM IST

Trolls On Actress Priyamani : సినిమా రంగంలో రాణించాలంటే గ్లామర్ ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది. హీరోలు, హీరోయిన్లు అందంగా, మంచి ఫిజిక్ తో ఉంటేనే వారికి గుర్తింపు వస్తుంది. లేదంటే వారిని కనీసం పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే దారుణమైన కామెంట్లు, ట్రోల్స్ చేయడం ఇప్పుడు పరిపాటి అయిపోయింది. ఇది ప్రియమణికి కూడా తప్పలేదంట.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది. నేను సినిమాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాను. కానీ మొదట్లో నేను కూడా కొన్ని అవమానాలకు గురయ్యాను. మొదట్లో నన్ను చూసిన వారు ఇంత నల్లగా ఉన్నావ్.. నీకు అవకాశాలు వస్తాయా అంటూ నెగెటివ్ గా కామెంట్లు చేసేవారు.
కొందరు అయితే నా సినిమాలు చూసి.. నువ్వు ఎలా హీరోయిన్ అయ్యావ్.. ముఖం అంత నల్లగా ఉంది.. అక్కడ కూడా నల్లగానే ఉంటుందా ఏంటీ.. అంటూ దారుణమైన పిచ్చి కామెంట్లు చేశారు. అవన్నీ భరించాను. ట్యాలెంట్ ఉంటే ఎంతటి స్థాయికి అయినా ఎదగొచ్చనేది నా అభిప్రాయం.
అదే నన్ను ఈ రోజు మీ ముందు నిలబెట్టింది అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది ప్రియమణి. నా పెండ్లి విషయంలో కూడాకొందరు చెడుగా మాట్లాడారు. సెకండ్ హ్యాండ్ గాడు దొరికాడా.. అంటూ ట్రోల్స్ చేశారు. కానీ నేను అవన్నీ పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. అందుకే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చెప్పింది ప్రియమణి.