ఇదేమ‌న్నా నీ ఇల్లు అనుకున్నావా.. మ‌హిళ తీరుపై నెటిజ‌న్స్ మండిపాటు

కొన్నిసార్లు కొంద‌రు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారుతూ ఉంటుంది. ప‌బ్లిక్ ప్లేస్ అన్న విష‌యాన్ని మ‌ర‌చిపోయి సొంత ఇంట్లో ఉన్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తుంటారు. విచ్చ‌ల‌విడిగా వారు ప్ర‌వ‌ర్తించే తీరుపై ప్ర‌తి ఒక్క‌రు ఫైర్ అవుతుంటారు. తాజాగా ఓ మ‌హిళ ఫ్లైట్‌లో చేసిన ర‌చ్చ‌పై నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.

TheNewsQube-

ప్ర‌స్తుతం నెట్టింట్లో ఓఫొటో వైరల్ అవుతుండ‌గా, ఈ ఫొటోలోని మహిళ విమానంలో ప్రయాణిస్తూ అంతా తన ఇష్టారాజ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. సొంత ఇంట్లో కూర్చున్నట్టు.. తాపీగా తన శిరోజాలను సీటు వెనకాల వేసుకుని రిలాక్స్‌డ్‌గా కూర్చుంది.

త‌న జుట్టు అంతా వెన‌క సీటు వైపు ఆర‌బోస్తూ చాలా అస‌హ్యంగా ప్ర‌వ‌ర్తించింది. ఈ జుట్టు వల్ల వెనక సీట్లో ఉన్న వారు ఇబ్బంది పడతారన్న విషయాన్ని కూడా లెక్కచేయనట్టు ఉంది ఆమె తీరు. అయితే.. ఆమె వెనక కూర్చున్న వ్యక్తి మాత్రం ఆమె తీరును ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

మ‌హిళ తీరుపై నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.ఇది నీ ఇల్లా లేక విమానమా.. కనీస జ్ఞానం ఉండక్కర్లేదా’’ అంటూ తిట్టిపోస్తున్నారు. కొంద‌రు జుట్టుని తీసి ట్రేలో పెట్టాల్సింది. అప్పుడు అర్ద‌మ‌య్యేద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ఫొటోను చూసిన నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.