Netizens Concluded That Salaar Connection With KGF2 Movie : సలార్ టీజర్.. ప్రభాస్ – యష్ మధ్య భారీ వార్.. కనిపెట్టిన నెటిజన్లు..
NQ Staff - July 6, 2023 / 07:34 PM IST

Netizens Concluded That Salaar Connection With KGF2 Movie :
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘సలార్’.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధారణ ఆడియెన్స్ సైతం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ వంటి సిరీస్ తెరకెక్కించిన తర్వాత సలార్ సినిమాను చేస్తున్నాడు.

Netizens Concluded That Salaar Connection With KGF2 Movie
దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.. ఇక ఈ రోజు నుండి ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసారు.. ఈ టీజర్ కు యునామినస్ రెస్పాన్స్ లభిస్తుంది. కేజిఎఫ్ లో యష్ ను ఏ రేంజ్ లో చూపించాడో అంతగా డబల్ రేంజ్ లో ప్రభాస్ ను చూపించాడు.. ఇక ఈ టీజర్ వచ్చినప్పటి నుండి ఫ్యాన్స్ ఒకటికి పదిసార్లు చూస్తూ ఇందులో ఉన్న ఆసక్తికర విషయాలను గుర్తిస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
ఇక టీజర్ తర్వాత కేజిఎఫ్ సినిమాతో సలార్ కు కనెక్షన్ ఉంది అని తేల్చేసారు.. అంతేకాదు ఇందులో యష్ కూడా ఉంటారనేందుకు మరింత బలం చేకూరింది. ప్రభాస్, యష్ మధ్య అతి పెద్ద క్రాసర్ ను సూచించింది.. అది నిజమే అని తెలిపేలా ఫ్యాన్స్ రెండు ఫోటోలను గుర్తించారు.. ఈ ఊహాగానాలతో ఈ రోజు సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుపుతున్నారు..

Netizens Concluded That Salaar Connection With KGF2 Movie
ప్రభాస్ తో పాటు యష్ కూడా సలార్ లో జరిగే వార్ లో ఉంటారని.. అందుకు సంబంధించిన క్లూస్ కూడా నీల్ సలార్ లో ఇచ్చాడని వీటిని గుర్తించినట్టు తెలిపారు.. మరి నీల్ ఈ ఇద్దరి ఫైట్ సీన్ ను ఎలా డిజైన్ చేశారు ? ఈ వార్ ప్రత్యక్షంగా ఉండబోతుందా? పరోక్షంగా ఉండబోతుందా? అనేది చూడాలి.. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది..