Tollywood Actors: ముంబైలో మ‌కాం.. ఏం సాధించాల‌నో అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Tollywood Actors: ఒకప్పుడు తెలుగు హీరోలకు, బాలీవుడ్ హీరోలకు ఆకాశం, భూమి మధ్య ఉన్నంత అంతరం ఉండేది. హిందీ సినిమా హీరోలంటే.. ఎవరెస్ట్ అంతే. వాళ్ల ఒక్కరోజు కలెక్షన్స్ ఇక్కడ మన హీరోలకు లైఫ్ టైమ్ వచ్చే వసూళ్లు అన్నమాట. మార్కెట్ లో అంత తేడా ఉండేది. కానీ ఏ ముహూర్తాన రాజమౌళి బాహుబలి సినిమా చేసాడో కానీ అప్పట్నుంచి అన్నీ మారిపోయాయి.

మెల్లగా సౌత్ సినిమాలకు కూడా గిరాకీ పెరిగిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ కంటే మన సినిమాలకే కలెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు తొలిరోజే 40 కోట్ల వరకు షేర్ తీసుకొస్తున్నాయి. మూడు రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేస్తున్నాయి. బాలీవుడ్ కు ధీటుగా మన సినిమాలు కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తున్నాయి.

Tollywood Actors

అందుకే మన హీరోల చూపు బాలీవుడ్ పై పడింది. ఇక్కడ ఉండి అక్కడ ఫోకస్ చేయడం ఎందుకు.. అక్కడే ఉంటే పోలా అనే ఆలోచనకు వచ్చేస్తున్నారు. అందుకే ముంబైలో సొంతిళ్లు తీసుకుంటున్నారు టాలీవుడ్ స్టార్స్. ఇప్పటికే ప్రభాస్ అక్కడ కొత్త ఇంటి కోసం 100 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. ఓ బంగళాను సొంతం చేసుకుంటున్నాడు ప్రభాస్. మరోవైపు రామ్ చరణ్ కూడా దాదాపు 120 కోట్లకు పైగానే ఖర్చు చేసి బాంబేలో బీచ్ ఏరియాలో ఓ బంగళాను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

ట్రిపుల్ ఆర్ తర్వాత కచ్చితంగా రామ్ చరణ్ కు బాలీవుడ్ లో మంచి మార్కెట్ రావడం ఖాయం. అందుకే ఇప్పట్నుంచే అక్కడి ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాడు చరణ్. రానాకు ఎప్పట్నుంచో బాంబేలో ఓ ఇల్లు ఉంది. ఇప్పటికే హిందీలో పలు సినిమాలు చేసాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు సమంత అక్కినేని సైతం ముంబైలో ఓ ఇంటి కోసం చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు హిందీలో క్రేజ్ బాగా పెరిగిపోయింది.

అందుకే అక్కినేని కోడలు అక్కడికి షిఫ్ట్ అయిపోవాలని చూస్తుంది. పైగా భర్త నాగ చైతన్య కూడా హిందీలో నటిస్తున్నాడు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్ధా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు చైతూ. తనకు కూడా హిందీలో బాగానే అవకాశాలు వస్తుండటంతో అక్కడ కూడా ఇంటిని తీసుకోవాలని చూస్తుంది అక్కినేని కోడలు. ఇక ఇప్ప‌టికే ర‌ష్మిక కూడా ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేసింది. త్వ‌ర‌లో యూత్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రామ్ పోతినేని వంటి స్టార్స్ కూడా ముంబైలో మ‌కాం పెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇలా టాలీవుడ్ స్టార్స్ అంద‌రు ముంబైకి మ‌కాం మార్చి ఏం సాధిస్తారో అని నెటిజ‌న్స్ చెవులు కొరుక్కుంటున్నారు.