Shruthi Haasan : అతనితో ఒకే ఇంట్లో ఉంటున్నా.. తప్పేంటి.. శృతిహాసన్ బరితెగించిందిరోయ్..!
NQ Staff - January 23, 2023 / 12:15 PM IST

Shruthi Haasan : సెలబ్రిటీలు రోజురోజుకూ హద్దులు మీరి పోతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌కు వెళ్లే వారంతా కూడా అక్కడ కల్చర్‌ను అలవాటు చేసుకుంటున్నారు. పెండ్లికి ముందే సహజీవనం చేయడం బాలీవుడ్ లో చాలా కామన్ అయిపోయింది. మనకు అక్కడ చాలానే ప్రేమ జంటలు కనిపిస్తాయి. పెండ్లికి ముందే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటారు చాలామంది. అందులో కొన్ని జంటలు మాత్రమే పెండ్లి చేసుకుంటాయి.
చాలా జంటలు ఏదో టైమ్ పాస్ చేసి చివరకు బ్రేకప్ చెప్పుకుంటారు. ఇప్పుడు శృతిహాసన్ యవ్వారం కూడా ఇలాగే ఉంది. ఆమె గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె కెరీర్ పరంగా స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.
చాలా కాలంగా డేటింగ్..
అయితే కెరీర్ పరంగా మంచి పొజీషన్ లో ఉన్న ఆమె.. వ్యక్తిగతంగా మాత్రం విమర్శలు ఎదుర్కుంటోంది. ఇప్పటికే ఆమె చాలామందితో ఎఫైర్లు నడిపింది. ఇక ప్రస్తుతానికి ఆమె శాంతాను హజారికతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారని, ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
కాగా ఇదే విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా కొందరు కామెంట్ చేయగా.. శృతిహాసన్ కూడా స్పందించింది. ఇతరుల ప్రైవేట్ విషయాలను తెలుసుకోవడం దేనికి అంటూ రిప్లై ఇచ్చింది. అంటే ఆమె నిజంగానే అతనితో ఒకే ఇంట్లో ఉంటుందన్న మాట. ఒకవేళ విడివిడిగా ఉంటే ఇలాంటి వాటిని ఖండించి ఉండేది కదా అంటున్నారు నెటిజన్లు.