Netizens Are Trolling Vijay Devarakonda : ఓవర్ బిల్డప్ తో ఆ హీరోల ఫ్యాన్స్ కు టార్గెట్ అయిపోయిన విజయ్ దేవరకొండ..!
NQ Staff - August 21, 2023 / 09:50 AM IST

Netizens Are Trolling Vijay Devarakonda :
విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న హీరో. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. మంచి సినిమాలు చేస్తే ఇప్పుడున్న ఐదారుగురు స్టార్ హీరోల్లో ఆయన కూడా ఉంటారు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. ఆ స్థాయికి వెళ్లడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ విజయ్ దేవరకొండ అతికి పోయి తన కెరీర్ ను తానే చిక్కుల్లో పడేసుకుంటున్నాడు. గతంలో లైగర్ సినిమా సమయంలో కొన్ని ఓవర్ బిల్డప్ డైలాగ్స్ కొట్టాడు. ఇండియా షేక్ అవ్వాలి, తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకోను లాంటి డైలాగులు ఆయనపై తీవ్రమైన నెగెటివిటీని పెంచుతాయి.
ఈ విషయాన్ని విజయ్ అర్థం చేసుకోవట్లేదు. లైగర్ పై తీవ్రమైన వ్యతిరేకత రావడానికి విజయ్ చేసిన అతి పెద్ద కారణం. మరి ఆ దెబ్బతో మరోసారి అలా చేయకుండా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కానీ విజయ్ మాత్రం తాజాగా నటిస్తున్న ఖుషీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇలాగే చేశాడు. సమంతను ఎత్తుకుని ఇష్టం వచ్చినట్టు తిప్పేశాడు. పైగా ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటూ ఆడేసుకున్నాడు. అదీ చాలదన్నట్టు బనియన్ మీద ఇదంతా చేయడం తీవ్రమైన ట్రోల్స్ కు దారి తీసింది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది సమంతతో అలా చేయడమే.
సమంతతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీ ఆమె విషయంలో కాస్త స్ట్రిక్ట్ గానే ఉంటుంది. అందుకే టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ ఆమెకు తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వట్లేదు. కానీ విజయ్ ఆ సాహసం చేశాడు. అదీ చాలదన్నట్టు అక్కినేని ఫ్యామిలీకి మండే విధంగా సమంతతో ఆయన రాసుకుని, పూసుకుని తిరుగుతున్నాడు. ఇదే ఇప్పుడు అక్కినేని హీరోలకు ఆయన్ను దూరం చేసిందని చెప్పుకోవాలి. సమంతతో ఇలాంటి పనులు చేయడం వల్ల అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ దృష్టిలో విజయ్ వ్యతిరేకం అయిపోయాడు. అందుకే ఆయన్ను ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదంట.

Netizens Are Trolling Vijay Devarakonda
ఇప్పుడు సోషల్ మీడియాలో విజయ్ మీద తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్న వారంతా అక్కినేని అభిమానులే. ఇదంతా చూస్తుంటే విజయ్ చేతులారా తన కెరీర్ ను తానే నాశనం చేసుకుంటున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. మన టాలీవుడ్ లో హీరోలు చాలా పద్ధతిగా ఉంటారు. బయట ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఎంత హుందాగా ప్రవర్తిస్తుంటారో మనం చూస్తున్నాం. వారు సినిమాల్లో ఎంత వైలెంట్ గా ఉన్నా సరే బయట మాత్రం ఓవర్ చేయకుండా పద్ధతిగా నడుచుకుంటారు.
మన సౌత్ ఇండస్ట్రీలో ఇలా పద్ధతిగా ఉంటేనే ప్రేక్షకులు మెచ్చుతారు. అంతే గానీ బాలీవుడ్ లాగా ప్రవర్తిస్తే ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. ఆ విషయం స్టార్ హీరోలకు తెలుసు కాబట్టే అతి చేయకుండా హుందాగా నడుచుకుంటారు. కానీ విజయ్ మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఏదో కొత్తగా ట్రెండ్ క్రియేట్ చేయాలని ఆరాటపడుతున్నాడు. కానీ అది తన కెరీర్ కు ప్రమాదం అని మాత్రం గ్రహించకపోతే అంతే సంగతులు.